NTV Telugu Site icon

Honeymoon Express : గ్రాండ్ గా “హనీమూన్ ఎక్స్ ప్రెస్” ప్రీ రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Honeymoon (2)

Honeymoon (2)

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా డైరెక్టర్ బాల రాజశేఖరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు..

ఈ కార్యక్రమంను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు సినీ యూనిట్ మొత్తం హాజరైయారు.. ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడిన మాటలు సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా నేను తిరిగి మన దగ్గరకు వచ్చేందుకు ఒక వెహికిల్ లా ఉపయోగపడింది. స్టార్ హోటల్స్ లో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవచ్చు కానీ నేను ప్రసాద్ ల్యాబ్స్ నే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఇక్కడే వేలాది సినిమాలు తయారయ్యాయి.. మా సినిమా కూడా అలానే హైలెట్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.

అలాగే హీరో, హీరోయిన్లకు మంచి ఇమేజ్ ఉంది.. తప్పకుండ ఈ సినిమాతో సినీ ప్రేక్షకులను మెప్పిస్తారని చెప్పాడు.. ఈ ఈవెంట్ కు డైరెక్టర్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. ఇక తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖర్‌ దర్శకుడు. కళ్యాణి మాలిక్‌ సంగీతం అందించారు. ఇప్పటికే హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..