Site icon NTV Telugu

Magic Movie: ‘మ్యాజిక్’కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

Magic Movie

Magic Movie

Gowtham Tinnanuri’s Magic Release Date: ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్‌’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్‌ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న మ్యాజిక్‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. కల నెరవేరాలంటే మొదట ప్రయత్నించాలి, ఆ ప్రయత్నాన్ని అందమైన ప్రయాణంలా మార్చుకోవాలని ఈ మ్యాజిక్ చిత్రంలో చూపిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులను ఈ చిత్రం మాయ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Also Read: Gnanavel Raja: వేట్టయన్ గురించి అనలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: కంగువా నిర్మాత

మ్యాజిక్ చిత్రంకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియరానున్నాయి.

Exit mobile version