Site icon NTV Telugu

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్, ఎమ్మెల్సీ కవిత

తెలుగు విశ్వ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. బతుకమ్మ పాటలలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని… పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారని… గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు.

Exit mobile version