మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. ఎంపీపై హత్యాయత్నంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Read also: Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
అయితే, భవిషత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఇక, నుంచి సెక్యూరిటీ చర్యలపై మరింత దృష్టి సారించాలంటూ డీజీపీకి గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె ఆదేశించారు.