మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూసీ నిర్వాసితుల కోసం 37 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. మూసీ నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇస్తుంది. 15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు అందజేస్తోంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధులు జారీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నిర్వాసితులు ఇండ్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
READ MORE: Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
ఇదిలా ఉండగా… మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు ఊపందుకోనుంది. ప్రనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైన విషయం తెలిసిందే. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా గతంలో జీవో జారీచేసినట్లు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ వెల్లడించారు. ‘కొన్నినెలలుగా 3 జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది. రెవెన్యూ అధికారులు నదిగర్భంలో, బఫర్‌జోన్‌లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. వాటిలో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించాం. బాధితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తున్నామనే వివరాలు కూడా ఇస్తాం. మొదట నదీ గర్భంలో ఉన్న 1,600 నిర్మాణాల్లోని బాధితులకు ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. పునరావాసం కల్పించాక ఆక్రమణలను తొలగిస్తాం. అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి చట్ట ప్రకారం నష్టపరిహారం, పునరావాసం అందాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలను పక్కాగా అమలు చేస్తాం’ అని ఆయన వివరించారు.
READ MORE:West Bengal : భర్త కిడ్నీ రూ.10 లక్షలకు అమ్మి.. డబ్బు తీసుకుని ప్రియుడితో పరారైన కిలాడీ లేడీ