Government Jobs: బీటెక్ , డిగ్రీ అర్హత తో BDLలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణాలో ఉన్న పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలను సంబందించిన పూర్తి వివరాలు చూద్దాం..
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభం అయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక సైట్ bdl-india.in ను సందర్శించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు నెల రోజుల సమయం ఇచ్చారు. సెప్టెంబర్ 20వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది…మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ , వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.. SC/ST/PWBD/మాజీ సైనికులు/అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు.. దరఖాస్తు ప్రక్రియ 21 ఆగస్టు 2023 న ప్రారంభం కాగా.. దరఖాస్తు ప్రక్రియ ముగిసే తేదీ 20 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు..
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
*. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
*. ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ కు వెళ్లండి.
*. ఇక్కడ మీరు అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ కు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
*. తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి.. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
*.ఇకపోతే దరఖాస్తు ఫారమ్ సమర్పించి డౌన్లోడ్ చేసుకోవాలి..
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక సైట్ bdl-india.in ను సందర్శించాలి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..