NTV Telugu Site icon

Nepal: కూలిన నేపాల్ ప్రభుత్వం.. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ

Napal

Napal

నేపాల్‌లో ప్రభుత్వం కూలిపోయింది. మద్దతు ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్‌ను పదవీ విరమణ చేయాలని కోరింది.

ఇది కూడా చదవండి: Pimples On Face : ముఖంపై పదే పదే మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఐతే ఇలా చేయాల్సిందే..

రెండు అతిపెద్ద పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీంతో ప్రధాని పుష్ప కమల్ మార్గం క్లియర్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పుష్ప కమల్ రాజీనామా చేయాలని నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకాష్ శరణ్ మహత్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే దహల్ తన పదవికి రాజీనామా చేయనని, దిగువ సభలో విశ్వాసాన్ని కోరతానని ప్రకటించారు.

బుధవారం జరిగిన సమావేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఎన్-యూఎంఎల్‌తో సోమవారం రాత్రి కుదిరిన ఒప్పందాన్ని నేపాలీ కాంగ్రెస్ ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం CPN-UML చైర్మన్, మాజీ ప్రధాని KP శర్మ ఓలీ ముందుగా ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా..

నవంబర్ 2022లో జరిగిన సాధారణ ఎన్నికలలో దిగువ సభలో మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో దహల్ డిసెంబర్ 2022లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేపాలీ కాంగ్రెస్, CPN రెండింటితో పొత్తులు పెట్టుకున్నారు. తాజాగా మద్దతు ఉపసంహరించుకోవడంతో మైనార్టీలో పడింది.

ఇది కూడా చదవండి: Indonesia: మహిళను మింగిన కొండచిలువ.. భర్త ఏం చేశాడంటే..!