Site icon NTV Telugu

Mangalagiri: మంత్రి నారా లోకేశ్​ నియోజకవర్గానికి అదనంగా రూ. 111.కోట్లు.. ఎందుకంటే?

Nara Lokesh

Nara Lokesh

మంత్రి నారా లోకేశ్​ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.కోట్ల కు పైగా నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు కేటాయింపుల వివరాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం గతంలో 21 గ్రామాలకు కలిపి రూ. 450.24 కోట్లతో డీపీఆర్​ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే యూఐడీఎఫ్ కింద రూ. 287.54 కోట్లు, అమృత్ 2.0 కింద రూ. 51.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇటీవల మరో 15 గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు. ఆయా గ్రామాల్లో పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం రూ. 111.50 కోట్లు నిధులు కేటాయింపులు చేశారు. నిధులను సీఆర్​డీఎ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

READ MORE: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!

Exit mobile version