Site icon NTV Telugu

Gorantla Madhav : పోలీసుల కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23, 24వ తేదీల్లో మాధవ్ ను విచారించేందుకు గుంటూరు నగర పోలీసులకు పర్మిషన్ ఇస్తూ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. కానీ కోర్టు రెండు రోజులకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గోరంట్ల మాధవ్. 23న మాధవ్ ను నగరం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర కామెంట్లు చేశాడని అతన్ని టీడీపీ కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది. ఈ విషయం తెలుసుకున్న మాధవ్ ఆగమేఘాల మీద గుంటూరుకు చేరుకున్నారు.
Read more: Off The Record: విజయ సాయిరెడ్డి వైసీపీ ముద్ర తొలగించుకోవాలనుకుంటున్నారా..?

అంతే కాకుండా చేబ్రోలు కిరణ్‌ మీద దాడి చేశాడు. పోలీసులు అదుపులో ఉన్న కిరణ్‌ మీద దాడి చేయడంతో పాటు.. పోలీసులతో వాగ్వాదం జరిగాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు తరలించగా.. కోర్టు రిమాండ్ విధించింది. అరెస్ట్ తర్వాత మాధవ్ వ్యవహరించిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కస్టడీలో ఘటన గురించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన మాధవ్.. ఆ తర్వాత వైసీపీ ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

Exit mobile version