UP : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తండ్రి తన కూతురిపై అసభ్యకర వీడియోలు చూపిస్తూ అత్యాచారం చేశాడు. అంతేకాదు ఎదరు తిరిగితే భార్య, కొడుకును చంపేస్తానని కూడా బెదిరించాడు. రాక్షసుడైన తండ్రి వల్ల ఇబ్బంది పడిన బాలిక అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన తండ్రిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కాలంగా తండ్రి తనను వేధిస్తున్నాడని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. టీజ్ చేస్తూ అసభ్యకర వీడియోలు కూడా చూపిస్తాడు. ఆమె నిరసన తెలపడంతో కూతురిని దారుణంగా కొట్టాడు. తండ్రి కొట్టడంతో కూతురు కంటిచూపు కూడా కోల్పోయింది.
Read Also:Viral Video : తల మీద క్యూ ఆర్ కోడ్ ను టాటూగా.. ఇదేం పిచ్చి రా నాయనా..
ఆ రోజు తన మాట వినమని తండ్రి తనను బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆ రోజు నీ అమ్మా, అన్న చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఎదురు తిరిగితే ఇంట్లో గొడవలు సృష్టిస్తాడని బాధితురాలు చెప్పింది. తన తండ్రి కిరాతకంతో ఇంటి వాతావరణమంతా చెడిపోయిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. భయం కారణంగా ఆమె చాలా కాలం పాటు తన తండ్రి చర్యలను బరించింది. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలతో ఆమె ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం ఈ నరకప్రాయమైన జీవితం నుంచి విముక్తి పొందాలని భావించింది. ఈ నరకం కంటే చనిపోవడమే మేలని అనుకొని పోలీసులకు చెప్పాడు.
Read Also:Telangana Govt: 112 మంది వైద్యులపై వేటుకు సిద్దమైన తెలంగాణ సర్కార్!
ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు నమోదు చేసినట్లు గోరఖ్‌నాథ్ సీఓ యోగేంద్ర సింగ్ తెలిపారు. పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.
