NTV Telugu Site icon

Gita GPT: భగవద్గీత స్ఫూర్తితో చాట్‌బాట్..ఏ డౌట్‌ ఉన్నా చెప్పేస్తుంది!

Gg

Gg

ప్రస్తుతం కృత్తిమ మేధ ఆధారంగా చాట్ బాట్‌ల రూపకల్పన జోరుగా సాగుతోంది. దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ పోటాపోటీగా వాటికి సంబంధించిన ఏఐ టూల్స్‌ను రూపొందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ సంస్థతో కలిసి చాట్ జీపీటీ అనే కృత్తిమ మేధ చాట్ బాట్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. దీనికి యూజర్ల నుంచి అశేషమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ కూడా బార్డ్ పేరుతో చాట్ బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే కేవలం దిగ్గజ సంస్థలే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయని అనుకుంటే పొరపాటే. ఇదే తరహా చాట్ బాట్‌ను అభివృద్ధి చేయాలని స్టార్టప్‌లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అటువంటి చాట్ బాటే గీత జీపీటీ (Gita GPT). బెంగళూరులోని ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీన్ని అభివృద్ధి చేశారు. దీని గురించి ఆ ఇంజనీర్ సుకురు సాయి వినీత్ వివరాలు తెలిపారు. భగవద్గీత స్ఫూర్తితో దీన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. ‘

Also Read: Google Bard: ‘బార్డ్’ ఎంత పనిచేసింది..గూగుల్‌కు 100 బిలియన్ డాలర్లు మటాష్!

చాట్ జీపీటీ వంటి ఏఐ ఆధారిత టూల్‌ను సాయి వినీత్ రూపొందించారు. మన జీవితానికి సంబంధించిన ఏదైనా ప్రశ్న అడిగితే ఈ గీత జీపీటీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సమాధానాల ఆధారంగా జవాబులు ఇస్తోంది. నేరుగా భగవద్గీత నుంచి సమాధానాలు అందుతాయి. ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం గీతను సంప్రదించండి అంటూ గీత జీపీటీ సూచిస్తోంది. ‘ఓపెన్ ఏఐ’ సంస్థ జీపీటీ-3 ఆధారంగా గీత జీపీటీని అభివృద్ధి చేశారు. ఇంటర్నెట్ గురించి ప్రాథమిక అంశాలు తెలిసిన వారందరూ ఇప్పుడు చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చాట్‌ బాట్.. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది. చాట్ జీపీటీ కూడా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చక్కని సలహాలు ఇస్తుంది.

Also Read: Ravindra Jadeja: జడేజా మ్యాజిక్ బాల్, నోరెళ్లబెట్టిన స్మిత్.. వీడియో వైరల్

Show comments