‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్స్, వాచ్‌లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్‌ను ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం ఈ చిప్‌ను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది. ఇవి సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించారు.
పిక్సెల్ వాచ్ 3లో రెండు మోడల్స్ ఉన్నాయి. 41ఎంఎం, 45ఎంఎం సైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. 41ఎంఎం సైజ్ ధర రూ.39,900గా.. 45ఎంఎం సైజ్ ధర రూ.43,900గా కంపెనీ నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాచ్‌ను 100 శాతం రిసైకిల్ అయిన అల్యూమినియంతో రూపొందించారు. వీటిని గూగుల్ ఏఐ యాక్సెస్ చేయవచ్చు. ఈ వాచ్‌తో గుండె పని తీరును ట్రాక్ చేయవచ్చు. ఈ వాచ్‌లో 24 గంటల రన్ టైమ్ బ్యాటరీని ఇచ్చారు. ఆగస్టు 22 నుంచి అమ్మకాలు ఆరంభం కానున్నాయి.