NTV Telugu Site icon

Google Pixel 8a Price: ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’ ఫోన్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ ఇవే!

Google Pixel 8a

Google Pixel 8a

Google Pixel 8a Release Date and Price in India: ఇంటర్నెట్‌ దిగ్గజం ‘గూగుల్‌’ నుంచి వచ్చిన పిక్సెల్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పిక్సెల్‌ 8 మోడల్‌ ఫోన్‌లకు భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో టెక్‌ ప్రియుల కోసం గూగుల్‌ మరో ఫోన్‌ను రిలీజ్ చేసింది. ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’ ఫోన్‌ మంగళవారం భారత్‌లో విడుదల అయింది. నిజానికి ఈ ఫోన్‌ను మే 14న జరగనున్న గూగుల్‌ ఐఓ కార్యక్రమంలో విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మే 7న సాయంత్రం రిలీజ్ చేశారు.

Google Pixel 8a Price:
గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌ భారతదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. మే 14 నుంచి ఫోన్ విక్రయాలు ఆరంభం అవుతాయి. 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.52,999గా ఉండగా.. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. అబ్సీడియన్‌, పోర్సిలిన్‌, అలో, బే రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇక లాంఛ్‌ ఆఫర్లలో భాగంగా బ్యాంకు కార్డులపై రూ.4000 వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. రూ.9,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా పొందొచ్చు. ఈ ఫోన్‌ను ముందుగా ఆర్డర్‌ చేసుకున్న వారు రూ.999కే పిక్సెల్‌ ఏ-సిరీస్‌ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 8a Camera:
గూగుల్‌ పిక్సెల్‌ 8ఏలో 64ఎంపీ మెయిన్ లెన్స్‌తో పాటు 13ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌ కెమెరాను ఇచ్చారు. సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 13ఎంపీ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డ్‌ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ ఉంది. సూపర్ రెస్ జూమ్, నైట్ సైట్, ఫోటో అన్‌బ్లర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ఫోటోలు మరియు వీడియోలలో ప్రతి ఒక్కరి ఖచ్చితమైన స్కిన్ టోన్‌ను చూపిస్తుంది.

Also Read: Sanju Samson: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌.. తొలి క్రికెటర్‌గా సంజూ శాంసన్‌!

Google Pixel 8a Battery:
గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. డిస్‌ప్లేపై కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ఉంటుంది. ఇక 18 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,404 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ పిక్సెల్‌ 8ఏలో ఉంటుంది. ఏడేళ్ల పాటు ఓఎస్‌, సెక్యూరిటీ, ఫీచర్‌ డ్రాప్‌ అప్‌డేట్లు ఇందులో ఉంటాయి.