NTV Telugu Site icon

Google Pay: అదిరిపోయే 3 సరికొత్త ఫీచర్లతో వచ్చిన గూగుల్ పే.. వివరాలు ఇలా..

Gpay

Gpay

ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి, అలాగే మరింత పారదర్శకంగా చేయడానికి గూగుల్ పే మూడు కొత్త ఫీచర్‌లను అందిస్తోంది. గూగుల్ పే ప్రకటన పోస్ట్ ప్రకారం., అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ఆటోఫిల్ డ్రాప్-డౌన్” మెనులో క్రోమ్ డెస్క్‌ టాప్‌ లో చెక్ అవుట్ చేసినప్పుడు వారు పొందగల ప్రయోజనాలను చూస్తారని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లలలో భాగంగా చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోని ఉండాలి. ఆ పై వినియోగదారులు ‘ఇప్పుడే కొనుగోలు చేయండి.. తర్వాత చెల్లించండి’ అనే ఆప్షన్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన కార్డ్ వివరాలను కూడా సురక్షితంగా ఆటోఫిల్ చేసుకోవచ్చు.

పేమెంట్ చెక్అవుట్ సమయంలో ప్రతి కార్డ్ బెనిఫిట్స్ కోసం గూగుల్ పే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.మనం ప్రస్తుత కొనుగోలుకు ఏ కార్డ్ బెస్ట్ రివార్డ్‌ లను అందిస్తుందో త్వరగా ఇందులో గుర్తించవచ్చు. ప్రతి కార్డ్ కు రివార్డ్ ప్రోగ్రామ్‌ ను మాన్యువల్‌ గా ఎలాంటి చెక్ చేయాల్సిన అవసరం లేకుండా., ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ఏ కార్డ్‌ని ఉపయోగించాలో యూజర్లు వెంటనే చూడవచ్చు.

ఇక మరొక ఫీచర్ విషయానికొస్తే.. “ఇప్పుడే కొనుగోలు చేయండి.. పే లేటర్ చెల్లించండి (బీఎన్‌పీఎల్‌)”. ఇది ఆన్‌లైన్‌ లో షాపింగ్ చేసేందుకు ఓ అద్భుతమైన ఆప్షన్. దీనికి కారణం వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్ అందిస్తుంది కాబట్టి. బీఎన్‌పీఎల్‌ ఉపయోగించడం ద్వారా వెంటనే వేగంగా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే మనం చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని ముందస్తుగా చెల్లించకుండా., ఈఎంఐల ద్వారా కాలక్రమేణా చెల్లించవచ్చు.

ఇక మరో ఫీచర్ విషయానికి వస్తే.. ఆటోఫిల్. ఇది ఆన్‌లైన్ చెక్అవుట్ సమయంలో షిప్పింగ్, బిల్లింగ్, పేమెంట్ వివరాలను ఆటోమాటిక్‌ గా ఎంటర్ చేయడం ద్వారా మన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ని గూగుల్ పే వేగవంతంగా మాత్రమే కాకుండా.. మరింత సురక్షితంగా అందించనుంది. ఈ కొత్త అప్డేట్ ఎలాంటి అంతరాయం లేని షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మనకు అందిస్తుంది గూగుల్ పే.