ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చుని బుక్ చేసుకుంటే కావాల్సిన వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. కానీ, డ్రెస్సులు కొనేటప్పుడు అవి మన మీద ఎలా కనిపిస్తాయో ఊహించడం కష్టం కదా? షాపింగ్ మాల్స్‌కు వెళ్లి ట్రై చేయాల్సిన ఇబ్బంది లేకుండా, ఇప్పుడు గూగుల్ ఒక అద్భుతమైన టూల్ ను తీసుకొచ్చింది. గూగుల్ తన “వర్చువల్ అప్పారెల్ ట్రై-ఆన్” టూల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారితమైన ఫీచర్. మీరు మీ స్వంత ఫోటో అప్‌లోడ్ చేస్తే బిలియన్ల ఆపారెల్ (దుస్తులు) లిస్టింగ్‌లను మీ మీద వర్చువల్‌గా ట్రై చేయవచ్చు.
Also Read:TPCC Mahesh Goud : ఎస్పీబీ పేరుతో రాజకీయాలా..? మహేశ్ గౌడ్ కౌంటర్
ఈ టూల్, ఇప్పుడు అమెరికా, యుకె, ఇండియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టూల్‌తో, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే ముందు బట్టలు మీకు బాగా కనిపిస్తాయో లేదో చూడటానికి వాటిని ప్రయత్నించవచ్చు. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో భారత్, UKకి దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య ఏమిటంటే బట్టలు తమకు బాగా కనిపిస్తాయో లేదో తెలియకపోవడం. ఇప్పుడు, Google నుండి వచ్చిన ఈ టూల్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఈ ఫీచర్ వివాహాల సీజన్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది మీరు గూగుల్ సెర్చ్, షాపింగ్ లేదా ఇమేజెస్‌లో దుస్తులు (టాప్స్, బాటమ్స్, డ్రెసెస్, జాకెట్స్, షూస్ వంటివి) గుర్తించినప్పుడు, “ట్రై ఇట్ ఆన్” (Try it on) ఐకాన్‌ను క్లిక్ చేసి ఉపయోగించుకోవచ్చు. గూగుల్ కస్టమ్ AI మోడల్ ఈ టూల్ పై పని చేస్తుంది. ఇది మానవ శరీరం, దుస్తుల (కాంతి, స్ట్రెచ్, ఫోల్డ్స్ వంటివి) గురించి లోతుగా అర్థం చేసుకుంటుంది. మీరు మీ స్వంత ఫుల్-లెంగ్త్ ఫోటో అప్‌లోడ్ చేసి, ఆ డ్రెస్ మీ మీద ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు టాప్స్, డ్రెస్సులు, జాకెట్లు, జీన్స్, స్కర్టులు, షూలను కూడా ప్రయత్నించవచ్చు.
Also Read:Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి
ఎలా పని చేస్తుందంటే?
ఈ టూల్ ఉపయోగించడం చాలా సులభం. మీ స్టైల్ బ్రౌజ్ చేయండి.. గూగుల్ సెర్చ్ లేదా షాపింగ్‌లో దుస్తులు కోసం సెర్చ్ చేయండి. ప్రొడక్ట్ లిస్టింగ్‌లో “ట్రై ఇట్ ఆన్” ఐకాన్ కనిపిస్తుంది (ఇది ఫ్రీ లిస్టింగ్స్, షాపింగ్ యాడ్స్‌లో ఉంటుంది). దాన్ని ట్యాప్ చేయండి.
మీ పోజ్ అప్‌లోడ్ చేయండి: మీ ఫుల్-బాడీ ఫోటో (మంచి లైటింగ్‌తో, ఫిటెడ్ క్లోత్స్‌లో) అప్‌లోడ్ చేయండి. గూగుల్ మీ అకౌంట్‌లో లాగిన్ అయి ఉండాలి (18 ఏళ్లు పైబడినవారికి మాత్రమే).
వర్చువల్‌గా ట్రై చేయండి: కొన్ని సెకన్లలో AI మీ ఫోటో మీద ఆ డ్రెస్ ను వేసి చూపిస్తుంది. డ్రెస్ ఎలా డ్రేప్ అవుతుంది, వ్రింకుల్స్, షాడోస్ – అన్నీ రియలిస్టిక్‌గా కనిపిస్తాయి.
షేర్ లేదా షాప్ చేయండి: ఇష్టమైతే సేవ్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. లేదా సిమిలర్ స్టైల్స్ కొనుగోలు చేయొచ్చు. మీ ఫోటో సేఫ్‌గా స్టోర్ అవుతుంది. ఈ AI టూల్ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఫిటింగ్ రూమ్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేస్తోంది.
