NTV Telugu Site icon

Anu Sharma: క్వాలిఫికేషన్‌ ఉద్యోగ అర్హతకు మించి ఉంది.. ఓ మహిళా టెక్కీ ఆవేదన

Anu Sharma

Anu Sharma

Anu Sharma: నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించేందుకు అభ్యర్థులు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధానంలో విద్యార్హతలు లేకపోవడంతో చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు. కానీ, మీరెప్పుడైనా మీలో అర్హతలు ఎక్కువగా ఉన్నందున ఉద్యోగం పొందలేకపోయారా..? అయితే, తాజాగా ఢిల్లీలోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఈ వింత అనుభవం ఎదురైంది. అధిక అర్హత ఉన్నందున ఉద్యోగాన్ని ఇవ్వలేమని ఒక సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించి వివరాలను సదరు మహిళా సోషల్ మీడియాలో వివరాలను పంచుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Read Also: KBC 16: చరిత్రలో మొదటిసారి.. షో మధ్యలోనే నిష్క్రమించిన కంటెస్టెంట్.. ఎందుంకంటే?

ఢిల్లీకి చెందిన అను శర్మ గూగుల్‌లో పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఆమె దరఖాస్తును తిరస్కరిస్తూ రిప్లై వచ్చింది. అయితే, కంపెనీ ఇచ్చిన సమాధానం ఆమెను ఆశ్చర్యపరిచింది. అదేంటంటే.. “మీ దరఖాస్తును సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఈ స్థానానికి అర్హతను మించి ఉన్నాయని కంపెనీ తెలిపింది. అలాగే, అధిక అర్హత కలిగిన అభ్యర్థులు తరచుగా తమ ఉద్యోగాలపై అసంతృప్తి చెందుతారని, తక్కువ రోజుల వ్యవధిలోనే వెళ్లిపోతారని తెలిపింది. ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేసిన అను శర్మ, “నేను ఇలా తిరస్కరించబడతానని నాకు తెలియదని రాసుకొచ్చింది.

Read Also: CM Revanth Reddy: నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు..

Show comments