ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధస్సు పై ఆధారపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రెండ్ కొనసాగుతున్న నేపధమ్యంలో.. దిగ్గజ టెక్ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. సుందర్ పిచాయ్ చాలా ఏళ్ల నుండి గూగుల్ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారు. అతను 2015లో గూగుల్ సీఈఓగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కంపెనీలో ఓ సాధారణ చిన్న ఉద్యోగిగా చేరి, సీఈఓ స్థాయికి ఎదిగిన పిచాయ్, దాదాపు 100 కోట్లు ($1 బిలియన్ల) సంపదతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా మారారు. దీనితో అతి త్వరలో బిలియనీర్ స్టేటస్ ను అందుకోనున్నారు. తాజాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
Also Read: Smart Anti Submarine: “స్మార్ట్” యాంటీ సబ్‌మెరైన్ సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థ ట్రయల్స్ విజయవంతం..
51 ఏళ్ల పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓ అయినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 400 శాతానికి పైగా పెరిగింది. అదే కాలంలో, ఇది S&P 500, NASDAQలను గణనీయంగా అధిగమించింది. సంస్థ యొక్క మొదటి త్రైమాసిక లాభం దాని క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత వృద్ధి అంచనాలను అధిగమించింది. ఆ తర్వాత గూగుల్ సరికొత్త రికార్డును అందుకుంది. అంతేకాకుండా, కంపెనీ తన చరిత్రలో మొదటిసారిగా డివిడెండ్ ను తీసుకవచ్చింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ రిపోర్ట్ ప్రకారం.. సుందర్ పిచాయ్ ఇలా బిలియనీర్ కాబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పిచాయ్ నికర విలువ 424 మిలియన్ డాల్లర్స్. ఇక ఆయన సీఈఓ అయినప్పటి నుండి దాదాపు 600 మిలియన్ డాలర్స్ విలువైన స్టాక్ లను విక్రయించారు.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. నిందితుడు జైలులో ఆత్మహత్య
సాధారణంగా, నికర విలువ కలిగిన కంపెనీ వ్యవస్థాపకులు మాత్రమే బిలియనీర్లు అవుతారు. కానీ సుందర్ పిచాయ్ అనే వ్యక్తి., సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లో ప్రాడక్ట్ మేనేజర్‌గా ప్రారంభించి.. ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దీని కారణంగా పిచాయ్ సామర్థ్యాలను గుర్తించిన గూగుల్ ఈ కంపెనీకి సీఈవోగా నియమించింది. మిస్టర్ పిచాయ్ కూడా అన్ని పనులను సమాన బాధ్యతతో నిర్వహించి కంపెనీని విజయపథంలో నడిపించారు.