Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google), ఏపీలో 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28న విశాఖపట్నం సమీపంలో శంకుస్థాపన జరగనుంది.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ స్వయంగా హాజరుకావడం విశేషం. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఏపీని తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు కీలక ప్రదేశాల్లో ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇక్కడ ప్రపంచ స్థాయి క్లౌడ్ మౌలిక సదుపాయాలు , డేటా స్టోరేజ్ వసతులను గూగుల్ అభివృద్ధి చేయనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఐటీ, అనుబంధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
Also Read:BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..
రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం..
గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీ’గా అవతరించనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం గూగుల్‌కే కాకుండా.. మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రోత్సహిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!