Site icon NTV Telugu

Goods Train: కేసముద్రంలో గూడ్స్ రైలుకు తప్పిన ముప్పు..

Goods Train

Goods Train

ఇటీవల రైల్వే శాఖను తరచూ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒడిశాలో ఇటీవలే మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన తర్వాత ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీలో మరికొన్ని రైలు ప్రమాద ఘటనలు జరిగాయి..కొన్ని త్రుటిలో ప్రమాదాలు తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ రైల్వే శాఖలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి.

Read Also: Prudhvi Raj Sukumaran: గాయంతో పోరాడుతున్నాను.. ప్రభాస్ విలన్ ఎమోషనల్ ట్వీట్

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ ల మధ్య విజయవాడ నుంచి కాజీపేటకు వస్తున్న గూడ్స్ రైలు లింక్ తెగిపోవడంతో.. గూడ్స్ గార్డ్ బోగీతో పాటు మరో బోగీని ఇంజిన్ వదిలి వెళ్లిపోయింది. దీంతో.. అప్రమత్తమై గార్డ్.. వెంటనే లోకో పైలెట్ కు సమాచారం అందించాడు.

Read Also: Spy : నిఖిల్ స్పై సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య…

కిలోమీట్ దూరం వెళ్లిన తర్వాత లోకోపైలెట్ ట్రైన్ ను ఆపేసి.. తిరిగి వెనక్కి వచ్చి విడిపోయిన బోగీలతో లింగ్ తగిలించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. విడిపోయిన బోగీలు పట్టాలు తప్పకపోవడంతో రైల్వే అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గార్డు అప్రమత్తంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Exit mobile version