Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో రైలు ప్రమాదం.. 10 గూడ్స్ రైలు బోగీలు బోల్తా

Train Accident

Train Accident

ఢిల్లీలోని (Delhi) రెసిడెన్షియల్ కాలనీ దగ్గర రైలు ప్రమాదం (Trian Accident) జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. మరోవైపు మరో ట్రాక్‌లో ప్రయాణికులతో ఉన్న రైలు ఆగి ఉంది. అటు వైపు బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గూడ్స్ రైలుకు చెందిన కనీసం 10 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు పోలీసులు తెలిపారు. జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఉదయం 11:50 గంటల ప్రాంతంలో పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ట్రాక్‌ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

 

Exit mobile version