NTV Telugu Site icon

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’ వీరమల్లు ‘ రిలీజ్ అప్పుడే?

Harihara

Harihara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.. సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..

నిన్న రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది.. టీజర్ ను చూసిన ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ మొదలైంది.. అంతేకాదు సినిమా పై మరో క్లారిటీ వచ్చేసింది.. టీజర్ లోనే సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.. సోషల్ మీడియాలో వీరమల్లు వచ్చేది ఈ డేట్‌కే అంటూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల కాబోతుందని ఊ వార్త షికారు చేస్తుంది.

ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కూడా వచ్చేశాడు.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ శాంతించారు.. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. త్వరలోనే సాంగ్ రిలీజ్ అవ్వబోతుందని సమాచారం..

Show comments