Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ అయిన “ఫియర్ సాంగ్”ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ,ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Read Also :Bacchala Malli : అల్లరి నరేష్ సినిమాకి భారీ డీల్ జరిగిందిగా..?
ఇదిలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ డేట్ లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావడం కష్టమే అని తెలుస్తుంది.ఆ డేట్ కు రాంచరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు చూస్తున్నట్లు సమాచారం.అయితే దేవర సినిమాను ప్రీపోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.అంటే అక్టోబర్ 10 కంటే ముందుగా సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం.అయితే ఆ రోజు పవన్ కల్యాణ్ ‘ఓజి’ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా మేకర్స్ తెలిపారు.అయితే తాజా సమాచారం ప్రకారం “ఓజి” సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.దీనితో ఈ డేట్ కు ఎన్టీఆర్ దేవర వస్తుందని సమాచారం.
