Site icon NTV Telugu

AP Govt: ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

Asha

Asha

Good News for ASHA Workers: ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ప్రకటించింది. ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయించింది. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే ₹5,000 చెల్లింపు చేపట్టనుంది. గరిష్టంగా మొత్తం1,50,000 వరకు చెల్లింపు చేపట్టనుంది. రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version