Site icon NTV Telugu

Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత

Goldmansachs

Goldmansachs

Employees Layoffs : ఆర్ధిక మాంద్యం వచ్చిన తర్వాత జాగ్రత‍్త పడే కంటే.. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా సన్నద్ధం అవ్వడం మంచిదని భావిస్తున్నాయి కంపెనీలు. ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనతో స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో టెక్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. 8 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఇటీవల అమెజాన్ ప్రకటించింది.

Read Also: Heart Attack: గుండెపోటుతో చనిపోయిన 12ఏళ్ల బాలుడు.. కర్ణాటకలో ఘటన

తాజాగా, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 3,200 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల మధ్య నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై పడే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది. గోల్డ్‌మన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సోలోమన్ మాట్లాడుతూ.. జనవరి తొలి అర్ధభాగం నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్నారు.

Read Also: Pongal Gift: రాష్ట్రప్రజలకు సర్కారు కానుక.. సరుకులతో పాటు రూ.1000కూడా

Exit mobile version