తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు కనుల పండువగా జరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఊరూవాడా అనే తేడాలేకుండా తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు మహిళలు.
బతుకమ్మలు ఎన్ని అంటే
1)ఎంగిలి పూల బతుకమ్మ
2) అటుకుల బతుకమ్మ
3) ముద్దపప్పు బతుకమ్మ
4) నానే బియ్యం బతుకమ్మ
5) అట్ల బతుకమ్మ
6) అలిగిన బతుకమ్మ
7) వేపకాయల బతుకమ్మ
8) వెన్నముద్దల బతుకమ్మ
9) సద్దుల బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.
Read Also:Salman Khan: గాడ్‌ఫాదర్‌కి సల్మాన్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాక్
తమ తాహతుకి తగ్గట్టుగా మహిళలు, కాలేజీ అమ్మాయిలు బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు. కూకట్ పల్లిలో బంగారు బతుకమ్మ సమ్ థింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటోంది. ఈ బతుకమ్మ పండుగ కి తాత గిఫ్ట్ ఇచ్చారు. పూల డిజైన్ తో కేజీన్నర వెండికి బంగారంతో కోటింగ్ ఇచ్చారో తాతయ్య. ఈ బంగారు బతుకమ్మ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కూకట్ పల్లికి చెందిన నాయినేని శ్రీ వైష్ణవి,శ్రీ నైన ల కోసం అందంగా డిజైన్ చేశారు వారి తాతయ్య. ఈ ఖరీదైన గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ బతుకమ్మను చూడడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సీహెచ్ జనార్ధన రావు పండుగ సందర్భంగా ఈ బతుకమ్మను తమకోసం తయారుచేసి ఇచ్చారని శ్రీ వైష్ణవి,శ్రీ నైన తెలిపారు. ఈ బతుకమ్మ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది.
Read ALso: Tirumala Srivari Brahmotsavam Garuda vahanam live: గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు