Site icon NTV Telugu

Gold Smuggling : కోల్‎కతాలో రూ.14కోట్ల విలువైన బంగారం పట్టివేత

Gold Transport

Gold Transport

Gold Smuggling : బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా బంగారాన్ని తరలించేస్తున్నారు. ఒక్కోసారి పట్టుబడితే..ఒక్కోసారి అక్రమ రవాణా జరిగిపోతుంటుంది. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. ఇలా వారి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా జరిగిపోతోంది. వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నా..కస్టమ్స్ చెకింగ్‌లో పట్టుబడిపోతున్నారు. ఇంకొన్నిసార్లు తప్పించుకుని..యధేఛ్చగా సరఫరా చేయగలుగుతున్నారు.

Read Also: BJP MP Laxman: కాంగ్రెస్ స్క్రిప్టును తండ్రీకొడుకులు చదివారు

కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. 14 కోట్ల విలువ చేసే 24.4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈస్టర్న్ గేట్‌వే ద్వారా కొందరు గుర్తు తెలియని దుండగులు అక్రమంగా బంగారం తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వేతో బంగారం గుట్టును రట్టు చేశారు. బంగ్లాదేశ్ నుండి నాటు పడవలో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో అస్సాం, త్రిపుర, కోల్కతా, బంగాదేశ్ లకు చెందిన 8మందిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అసోం, త్రిపుర, కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్ డీఆర్ఐ అధికారులు పహారా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Notice to God : స్థలం ఖాళీ చేయాలంటూ హనుమంతుడికి నోటీసులు

Exit mobile version