Gold Rate Today in Hyderabad: పండగ వేళ పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్ షాక్ ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన పసిడి ధరలు.. మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. గత 10 రోజుల్లో ఒక్కసారి గోల్డ్ రేట్స్ తగ్గితే.. ఐదుసార్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650గా.. 24 క్యారెట్ల ధర రూ.71,620గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,620గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,800 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.71,770గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,620గా ఉంది.
Also Read: MS Dhoni: ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్.. ఎంఎస్ ధోనీకి దక్కని చోటు!
మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ.84,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో నేడు కిలో వెండి ధర రూ.89,000గా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.84,000గా ఉంది.