గత రెండు సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 80 వేలు దాటింది. అయినా కూడా పెరుగుదల ఆగడం లేదు. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగి.. రూ.74,400గా నమోదైంది. ఇక 24 క్యారెట్లపై రూ.710 పెరిగి.. రూ.81,160గా ఉంది. మంగళవారం వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.
మరోవైపు బంగారం బాటాలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. కిలో వెండి లక్షను తాకింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.1,00,000గా నమోదయింది. నిన్న కూడా వెండి ధర వెయ్యి పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండగ వేళ పెరిగిన బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అక్టోబర్ 30న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.74,400
విజయవాడ – రూ.74,400
ఢిల్లీ – రూ.74,550
చెన్నై – రూ.74,400
బెంగళూరు – రూ.74,400
ముంబై – రూ.74,400
కోల్‌కతా – రూ.74,400
కేరళ – రూ.74,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.81,160
విజయవాడ – రూ.81,160
ఢిల్లీ – రూ.81,310
చెన్నై – రూ.81,160
బెంగళూరు – రూ.81,160
ముంబై – రూ.81,160
కోల్‌కతా – రూ.81,160
కేరళ – రూ.81,160
Also Read: Mohammed Shami: అయ్యో పాపం మహమ్మద్ షమీ.. గాయం ఎంతపని చేసే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,09,000
విజయవాడ – రూ.1,09,000
ఢిల్లీ – రూ.1,00,000
ముంబై – రూ.1,00,000
చెన్నై – రూ.1,09,000
కోల్‌కతా – రూ.1,00,000
బెంగళూరు – రూ.1,00,000
కేరళ – రూ.1,09,000