NTV Telugu Site icon

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర! అంతకుమించి వెండి

Today Gold Price

Today Gold Price

గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1790 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,560గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్న వెండి.. నేడు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై రూ.3000 తగ్గి.. రూ.93,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష రెండు వేలుగా ఉంది. ఇటీవలి రోజుల్లో లక్ష పన్నెండు వేలకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. నేడు పసిడి, వెండి ధరలు ఇంతలా తగ్గడానికి కారణం యూస్ ఎలక్షన్స్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,000
విజయవాడ – రూ.72,000
ఢిల్లీ – రూ.72,150
చెన్నై – రూ.72,000
బెంగళూరు – రూ.72,000
ముంబై – రూ.72,000
కోల్‌కతా – రూ.72,000
కేరళ – రూ.72,000

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,560
విజయవాడ – రూ.78,560
ఢిల్లీ – రూ.78,710
చెన్నై – రూ.78,560
బెంగళూరు – రూ.78,560
ముంబై – రూ.78,560
కోల్‌కతా – రూ.78,560
కేరళ – రూ.78,560

Also Read: IPL Auction 2025: ఇది తెలుసా.. ఐపీఎల్‌ వేలంలో ఇటలీ ఆటగాడు!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000
చెన్నై – రూ.1,02,000
కోల్‎కతా – రూ.93,000
బెంగళూరు – రూ.93,000
కేరళ – రూ.1,02,000

 

Show comments