NTV Telugu Site icon

Gold Rate Today: వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Today Gold Price

Today Gold Price

ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్.. తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. గత వారంలో వరుసగా ఐదు రోజులు పసిడి ధరలు పెరిగితే.. శుక్రవారం కాస్త తగ్గింది. మళ్లీ శనివారం పెరగ్గా.. ఆదివారం స్థిరంగా ఉంది. సోమవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 పెరిగి.. రూ.80,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగి.. రూ.87,870గా కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న వెండి.. మరలా పుంజుకుంటోంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఎనమిది వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,550
విజయవాడ – రూ.80,550
ఢిల్లీ – రూ.80,690
చెన్నై – రూ.80,550
బెంగళూరు – రూ.80,550
ముంబై – రూ.80,550
కోల్‌కతా – రూ.80,550
కేరళ – రూ.80,550

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,870
విజయవాడ – రూ.87,870
ఢిల్లీ – రూ.88,020
చెన్నై – రూ.87,870
బెంగళూరు – రూ.87,870
ముంబై – రూ.87,870
కోల్‌కతా – రూ.87,870
కేరళ – రూ.87,870

Also Read: Champions Trophy 2025: ఎక్కడో చిన్న ఆశ సీనా.. పాకిస్థాన్‌ సెమీస్ చేరాలంటే సమీకరణాలు ఇలా!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,08,000
విజయవాడ – రూ.1,08,000
ఢిల్లీ – రూ.1,01,000
ముంబై – రూ.1,01,000
చెన్నై – రూ.1,08,000
కోల్‎కతా – రూ.1,01,000
బెంగళూరు – రూ.1,01,000
కేరళ – రూ.1,08,000