ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన అనంతరం ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి చేరింది. అయినా కూడా బంగారం ధరలో పెరుగుదల ఆగడం లేదు. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరగగా.. నేడు రూ.800 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.390, రూ.870 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఫిబ్రవరి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,600గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,930గా నమోదైంది.
బంగారం ధర పెరుగుతున్నా.. వెండి ధర మాత్రం కాస్త ఊరటనిస్తోంది. వరుసగా 6వ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.99,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.99,500గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,600
విజయవాడ – రూ.80,600
ఢిల్లీ – రూ.80,750
చెన్నై – రూ.80,600
బెంగళూరు – రూ.80,600
ముంబై – రూ.80,600
కోల్‌కతా – రూ.80,600
కేరళ – రూ.80,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,930
విజయవాడ – రూ.87,930
ఢిల్లీ – రూ.88,080
చెన్నై – రూ.87,930
బెంగళూరు – రూ.87,930
ముంబై – రూ.87,930
కోల్‌కతా – రూ.87,930
కేరళ – రూ.87,930
Also Read: Gachibowli Drugs: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం.. బ్రౌన్ హెరాయిన్ సీజ్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.99,500
ముంబై – రూ.99,500
చెన్నై – రూ.1,07,000
కోల్‌కతా – రూ.99,500
బెంగళూరు – రూ.99,500
కేరళ – రూ.1,07,000