దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మరలా పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. వరుసగా మూడు రోజులు భారీ స్థాయిలో పెరిగి రికార్డు సృష్టించాయి. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, రూ.2700 పెరగగా.. ఈరోజు రూ.1850 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.710, రూ.2940, రూ.2020 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఏప్రిల్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.95,400గా నమోదయింది. ఈ మూడు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 5 వేలకు పైగా పెరగడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,450గా.. 24 క్యారెట్ల ధర రూ.95,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు భారతదేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ప్రభావం చూపింది. ఏదేమైనా పసిడి ధరలు ఊహించని రీతిలో పెరగడంతో.. జనాలు షాక్ అవుతున్నారు. ఇక బంగారం కొనడం కష్టమేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్ తొలి జట్టుగా!
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ఇటీవల వరుసగా తగ్గుతూ, స్థిరంగా కొనసాగిన వెండి.. రెండు రోజులుగా పెరుగుతోంది. కిలో వెండిపై నిన్న రూ.4000 పెరగగా.. ఈరోజు రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,100గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 8 వేలుగా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.