NTV Telugu Site icon

Gold Rate Today: మగువలకు భారీ షాక్.. రూ.87 వేలు దాటిన బంగారం ధర!

Gold Price Today

Gold Price Today

కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.87 వేలు దాటేసింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి.. రూ.79,800గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి.. రూ.87,060గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే.

మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు వెండి స్థిరంగా కొనసాగుతోంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.99,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.99,500గా కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,800
విజయవాడ – రూ.79,800
ఢిల్లీ – రూ.79,950
చెన్నై – రూ.79,800
బెంగళూరు – రూ.79,800
ముంబై – రూ.79,800
కోల్‌కతా – రూ.79,800
కేరళ – రూ.79,800

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,060
విజయవాడ – రూ.87,060
ఢిల్లీ – రూ.87,210
చెన్నై – రూ.87,060
బెంగళూరు – రూ.87,060
ముంబై – రూ.87,060
కోల్‌కతా – రూ.87,060
కేరళ – రూ.87,060

Also Read: Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌.. సచిన్‌ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.99,500
ముంబై – రూ.99,500
చెన్నై – రూ.1,07,000
కోల్‎కతా – రూ.99,500
బెంగళూరు – రూ.99,500
కేరళ – రూ.1,07,000