NTV Telugu Site icon

Gold Rate Today: మగువలకు ‘బంగారం’ లాంటి వార్త.. తులంపై 1500 తగ్గింది!

Gold Price Today

Gold Price Today

మగువలకు ‘బంగారం’ లాంటి వార్త అనే చెప్పాలి. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు ధరకు చేరిన గోల్డ్ రేట్స్.. కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజుల్లో రెండుసార్లు పసిడి ధరలు పెరగగా.. ఐదుసార్లు తగ్గాయి. ఈరోజు అయితే తులంపై దాదాపుగా రూ.1500 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1350 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1470 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల ధర రూ.70,850గా.. 24 క్యారెట్ల ధర రూ.77,290గా నమోదైంది.

మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ఇటీవల రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండోరోజు తగ్గింది. నిన్న కిలో వెండిపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.2000 తగ్గింది. మంగళవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా ఉంది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం మన దేశంలో గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. ఇక దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,850
విజయవాడ – రూ.70,850
ఢిల్లీ – రూ.71,000
చెన్నై – రూ.70,850
బెంగళూరు – రూ.70,850
ముంబై – రూ.70,850
కోల్‌కతా – రూ.70,850
కేరళ – రూ.70,850

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,290
విజయవాడ – రూ.77,290
ఢిల్లీ – రూ.77,440
చెన్నై – రూ.77,290
బెంగళూరు – రూ.77,290
ముంబై – రూ.77,290
కోల్‌కతా – రూ.77,290
కేరళ – రూ.77,290

Also Read: Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా కొత్త సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.1,00,000
కోల్‎కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.1,00,000