NTV Telugu Site icon

Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!

Gold Rate Lady

Gold Rate Lady

Gold Price Today in Hyderabad on 21st June 2024: బంగారం ధరలు కొనుగోలు దారులను మరలా బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో తగ్గిన పసిడి రేట్స్.. మళ్లీ ఆల్ టైమ్ దిశగా పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.810 పెరిగింది. శుక్రవారం (జూన్ 21) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,250గా నమోదైంది. నేడు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1500 పెరిగి.. 94,000గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.67,150
విజయవాడ – రూ.67,150
ఢిల్లీ – రూ.67,300
ముంబై – రూ.67,150
బెంగళూరు – రూ.67,150
కోల్‌కతా – రూ.67,150
కేరళ – రూ.67,150
పూణే – రూ.67,150
అహ్మదాబాద్ – రూ.67,200

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.73,250
విజయవాడ – రూ.73,250
ఢిల్లీ – రూ.73,400
ముంబై – రూ.73,250
బెంగళూరు – రూ.73,250
కోల్‌కతా – రూ.73,250
కేరళ – రూ.73,250
పూణే – రూ.73,250
అహ్మదాబాద్ – 73,300

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్‌ – రూ.98,500
విజయవాడ – రూ.98,500
ఢిల్లీ – రూ.94,000
ముంబై – రూ.94,000
బెంగళూరు – రూ.92,850
చెన్నై – రూ.98,500
కేరళ – రూ.98,500
పూణే – రూ.94,000

Show comments