గోల్డ్ రేట్స్ తగ్గాయన్న సంతోషం మగువలకు రెండు రోజులే ఉంది. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి.. నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగ్గా.. 22 క్యారెట్లపై రూ.1,100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా.. 24 క్యారెట్ల ధర రూ.95,130గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: TTD: శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..!
మరోవైపు వెండి ధర మాత్రం ఊరటనిస్తోంది. ఇటీవలి రోజుల్లో వెండి ధర స్థిరంగా ఉండడం లేదా తగ్గుతోంది. నిన్న రూ.900 తగ్గిన వెండి.. నేడు స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 8 వేలుగా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో 97 వేలుగా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. నేటి ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
