NTV Telugu Site icon

Gold Prices Today: గోల్డ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్… స్థిరంగానే బంగారం ధరలు

Gold Price

Gold Price

Gold Prices Today: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నేడు వడ్డీ రేట్లను ప్రకటించనుంది. సుమారు 50 బేసిస్ పాయింట్లు పెరగొచ్చాన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపుతోనే ద్రవ్యోల్బణం ముడిపడి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో డాలర్ పతనం అవుతోంది. దీంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు ఆర్నెళ్ల గరిష్టంలో ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1810 డాలర్లపైకి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 23.72 డాలర్లకు పెరిగింది. ఇక రూపాయి కూడా రోజురోజుకూ క్షీణిస్తూ వస్తుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.82.810కి పడిపోయింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు గరిష్టాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ.100 మేర పడిపోయింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 54,330 వద్ద ఉంది.

Read Also: Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు

బంగారంతో పోలిస్తే వెండి రేటు మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో తాజాగా కిలో వెండి రూ. 200 మేర పెరిగి ప్రస్తుతం రూ.73 వేల మార్కుకు ఎగసింది. 10 రోజుల్లో దాదాపు రూ.2000 వరకు ఎగబాకడం గమనార్హం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో రేటును పెంచింది. గతంలో వరుసగా 50 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచగా ఈసారి మాత్రం దానిని కాస్త తగ్గించింది. 35 బేసిస్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ ఒక్క ఏడాదే ఏకంగా 2.25 శాతం మేర రెపో రేటును పెంచడం గమనార్హం. దీంతో వడ్డీ రేటు 6.25 శాతానికి పెరిగింది. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం జరగనుంది. మరోసారి అప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి.