NTV Telugu Site icon

Gold Rates Today : బంగారం కొనుగోలు దారులకు షాక్.. రూ.80వేలు క్రాస్ చేసిన పుత్తడి

Gold

Gold

Gold Rates Today : బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతలా అంటే బంగారం కొనుగోలు చేసే ముందు రోజు రాత్రి వారికి నిద్ర కూడా పట్టదు. బంగారు ఆభరణాలను చూసి తమ సొంతం చేసుకునే వరకూ వాళ్లు నిద్రపోరు. అంతలా ప్రేమిస్తారు బంగారాన్ని. అందుకే ఏ వస్తువు కొనుగోలు విషయంలోనూ వారు దుకాణాలకు రావడానికి ఆసక్తి కనపర్చరు. కానీ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మాత్రం ఖచ్చితంగా షాపులకు మహిళలే ఎక్కువ వస్తారు. వారే దగ్గరుండి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధరలు కాస్తా అటూ ఇటూ అయినా పెద్దగా ఆలోచించరు. బంగారాన్ని సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లేందుకే ఎక్కువ ఉత్సాహం చూపుతారు.

Read Also :Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నూతన సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 81,000 సమీపంలో ఉంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. బంగారం ధర జనవరి 13వ తేదీ సోమవారం ఇలా నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,070 గా పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,400గా పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 1,04,300గా ఉంది.

Read Also :Kiran Kumar Reddy: వైఎస్‌ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Show comments