Site icon NTV Telugu

Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు.. 89 వేలకు చేరువలో

Gold Price

Gold Price

Gold Rates: గత కొద్ది రోజుల నుంచి ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు దూసుకు వెళ్తున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే దాదాపు పది శాతం పైగా బంగారం ధరలు పెరిగాయి అంటే.. ఎంతలా ధరలు పెరుగుతున్నాయా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు బంగారం ధరలు ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. శుక్రవారం నాడు బంగారం ధర పెరుగుదల కాస్త శాంతించిందని చెప్పవచ్చు. తాజాగా తులం బంగారంపై కేవలం వంద రూపాయలు మాత్రమే పెరిగింది. మరోవైపు కేజీ వెండిపై రూ.100 తగ్గింది.ఇక నేటి బంగారం ధరల విషయానికి వస్తే..

Read Also: Hyderabad : జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వంద రూపాయల పెరిగి రూ. 80,800 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు వంద రూపాయలు పెరిగి రూ. 88,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర కూడా వంద రూపాయలు పెరిగి రూ. 66,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. వెండి ధరల్లో మాత్రం కాస్త తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా కేజీ వెండి ధరపై వంద రూపాయలు తగ్గి ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కేజీ వెండి రూ. 1,07,900 వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి పరుగులు పెడుతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలన్న ఆలోచనలని దరిచేరనివ్వట్లేదు. మరోవైపు ఉన్నత వర్గాల వారు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తున్నారు. అలాగే బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో బంగారం అమ్మే యజమానులు కూడా వ్యాపారం లేక డీల పడిపోయారు.

Exit mobile version