Gold and Silver Rates Today in Hyderabad on 1st August 2024: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకంను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఒక్కరోజే రూ.3 వేల వరకు పతనమైన గోల్డ్ రేట్స్.. తర్వాత కూడా వరుసగా పడిపోయాయి. 10 రోజుల పాటు బంగారం ధర పెరగలేదు. ఆ సమయంలో ఏకంగా రూ.6 వేలు పడిపోయింది. గోల్డ్ రేట్స్ తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి.
బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరిగి.. రూ.64,500లుగా ఉంది. 22 క్యారెట్లపై నిన్న రూ.800 పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870 పెరిగి.. రూ.70,360గా నమోదైంది. అంతకుముందు రోజు రూ.870 పెరిగింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ.64,500లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,360గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.64,650లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,510గా కొనసాగుతోంది.
Also Read: IPL Auction 2025: ఆ విదేశీ ప్లేయర్‌లను బ్యాన్ చేయండి.. బీసీసీఐని కోరిన కావ్య మారన్!
వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్న కిలో వెండిపై రూ.2000 పెరగ్గా.. నేడు రూ.600 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.87,100గా ఉంది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.87,100గా ఉంది. బెంగళూరులో రూ.85,500, చెన్నైలో 91,700గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో రూ. 91,700 కొనసాగుతోంది.