NTV Telugu Site icon

Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్‌.. నేడు తులం ఎంతుందంటే?

Gold Price Today Hyderabad

Gold Price Today Hyderabad

Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్‌ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.1000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,600 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.70,460గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా ఉంది.

Also Read: Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం!

వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.83,100గా ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.88,100గా నమోదైంది. ఢిల్లీలో రూ.83,100గా.. ముంబైలో రూ.83,100గా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో రూ.80,650గా నమోదైంది.

Show comments