NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gld

Gld

బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గురువారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 దిగొచ్చి.. రూ. 56,990కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 62,170కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. వెండి కూడా బంగారం బాటలోనే సాగుతోంది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది.. రూ. 75,400కి చేరింది.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720గా ఉంది.న్యూఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 57,140 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300గా ఉంది. అదే విధంగా భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగరాం ధర రూ. 62,170గా ఉంది..

వెండి ధర విషయానికొస్తే.. వెండి కూడా బంగారం బాటలోనే సాగుతోంది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. గురువారం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 73,900కి చేరింది. ఇక చెన్నైతో పాటు హైదారాబాద్‌ లో కూడా రూ. 75,400 గా ఉంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..