Gold and Silver Prices Today in Hyderabad: గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో తగ్గుదలకు తోడు బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించేలోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. 10 రోజుల తర్వాత నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి రూ. 63,250గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.270 పెరిగి రూ.69,000గా ఉంది.
Also Read: Vikrant Massey: జాతీయ అవార్డు కంటే.. ప్రేక్షకుల ఆదరణ గొప్పది!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,400 పలకగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,150గా ఉంది. హైదరాబాద్‌లో మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,000గా పలుకుతోంది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,250లుగా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.63,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,000గా నమోదైంది. మరోవైపు రెండు రోజులుగా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.84,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా నమోదైంది.