Gold Rate Today in India on 17 July 2024: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. తగ్గడం లేదు. ఒకవేళ తగ్గినా కూడా తర్వాతి రోజుల్లో భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు 75 వేల మార్క్‌ను తాకాయి. పెరుగుతున్న ధరలు చూసి.. కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు అయితే ‘బంగారం’ అనే పదమే మరిచిపోతున్నారు. ఇటీవలి రోజుల్లో పెరుగుతున్న ధరలను చూస్తుంటే.. తులం లక్షకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బుధవారం (జులై 17) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.75,000కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.96,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.68,750
విజయవాడ – రూ.68,750
ఢిల్లీ – రూ.68,900
చెన్నై – రూ.69,200
బెంగళూరు – రూ.68,750
ముంబై – రూ.68,750
కోల్‌కతా – రూ.68,750
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,000
విజయవాడ – రూ.75,000
ఢిల్లీ – రూ.75,150
చెన్నై – రూ.75,490
బెంగళూరు – రూ.75,000
ముంబై – రూ.75,000
కోల్‌కతా – రూ.75,000
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,500
విజయవాడ – రూ.1,00,500
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,000
చెన్నై – రూ.1,00,500
కోల్‌కతా – రూ.96,000
బెంగళూరు – రూ.96,000