Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ.2130 తగ్గిన బంగారం ధర!

  • గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  • ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
  • తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే
Gold Price Today Hyderabad

Gold Price Today Hyderabad

గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు భారీ స్థాయిలో తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,130 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.1,950 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (మే 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.93,930గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో లక్షకు చేరువైన పసిడి.. కాస్త తగ్గుముఖం పట్టడం సంతోషించాల్సిన విషయం.

Also Read: Kohli-Rohit: కోహ్లీ-రోహిత్ ముందే వీడ్కోలు పలికారా?.. 50 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన ప్లేయర్స్ వీరే!

మరోవైపు వెండి ధర కూడా నేడు తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి నిన్న స్థిరంగా ఉండగా.. ఈరోజు మరలా తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,000గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 8 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో 97 వేలుగా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.