Gold and Silver Rate Today in India: కేంద్ర బడ్జెట్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నాయి. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. తిరిగి పుంజుకుంటున్నాయి. గత ఐదు రోజుల్లో మూడుసార్లు ధరలు పెరిగాయి. ఈ ఒక్కరోజే బంగారం ధరల్లో భారీగా మార్పు చోటు చేసుకుంది. మేలిమి బంగారమైన 24 క్యారట్ల 10 గ్రాములపై రూ.870 పెరగగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.800 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జూన్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000లుగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది.
మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఈ ఒక్కరోజే సిల్వర్ రేటు ఊహించని రీతిలో పెరిగింది. కిలో వెండిపై ఏకంగా 2 వేలు పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.86,500కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.64,000
విజయవాడ – రూ.64,000
ఢిల్లీ – రూ.64,150
చెన్నై – రూ.64,200
బెంగళూరు – రూ.64,000
ముంబై – రూ.64,000
కోల్‌కతా – రూ.64,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,820
విజయవాడ – రూ.69,820
ఢిల్లీ – రూ.69,970
చెన్నై – రూ.70,040
బెంగళూరు – రూ.69,820
ముంబై – రూ.69,820
కోల్‌కతా – రూ.69,820
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.91,000
విజయవాడ – రూ.91,000
ఢిల్లీ – రూ. 86,500
ముంబై – రూ. 86,500
చెన్నై – రూ.91,000
కోల్‌కతా – రూ.86,500
బెంగళూరు – రూ.84,000