Gold and Silver Rates in India: పసిడి ప్రియులకు భారీ షాక్. వరుసగా రెండు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు భారీగా పెరిగాయి. బుధవారం (అక్టోబర్ 16) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.450 పెరిగి.. రూ.71,400గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 పెరిగి.. రూ.77,890గా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ 78 వేలకు చేరువవ్వడంతో కొనుగోలుదారులు కంగుతింటున్నారు.
మరోవైపు నిన్న తగ్గిన వెండి ధర.. నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.97,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 92 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,400
విజయవాడ – రూ.71,400
ఢిల్లీ – రూ.71,550
చెన్నై – రూ.71,400
బెంగళూరు – రూ.71,400
ముంబై – రూ.71,400
కోల్‌కతా – రూ.71,400
కేరళ – రూ.71,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,890
విజయవాడ – రూ.77,890
ఢిల్లీ – రూ.78,040
చెన్నై – రూ.77,890
బెంగళూరు – రూ.77,890
ముంబై – రూ.77,890
కోల్‌కతా – రూ.77,890
కేరళ – రూ.77,890
Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్తకు ఊహించని ఘటన.. డేంజర్‌లో ఉన్నాడా?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,900
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.97,900
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.97,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,03,000