Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!

  • గోల్డ్ లవర్స్‌కు శుభవార్త
  • 24 క్యారెట్లపై రూ.710 తగ్గింది
  • తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందటే?
Gold Price

Gold Price

భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.150, రూ.650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.160, రూ.710 తగ్గింది.

Also Read: Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణ భయంతో కార్మికులు పరుగులు!

బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,130గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర.. నేడు తగ్గింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.91,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.91,500గా ఉంది.