Gold Price Today in Hyderabad: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పెరగడం గమనార్హం. ఇటీవల రోజుల్లో తగ్గిన దాని కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో మరోసారి ఆల్ టైమ్ దిశగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 పెరిగింది. గురువారం (జూన్ 6) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,420గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.67,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,570గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా ఉంది.
Also Read: Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఏ స్టార్ అంటే?
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,800 పెరిగి.. రూ.93,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.93,500 ఉండగా.. ముంబైలో కూడా రూ.93,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.98,000లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.98,000లుగా ఉంది.