Gold Price Today Hyderabad on 4th July 2024: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి రేట్స్.. మళ్లీ పెరుగుతూ పోతున్నాయి. గత వారం రోజుల్లో 4 రోజులు పెరగగా.. మూడు రోజులు స్థిరంగా ఉన్నాయి. గురువారం (జులై 2) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,240గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,090గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,600గా.. 24 క్యారెట్ల ధర రూ.73,750గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,090గా ఉంది.
Also Read: Bhanuprakash Reddy: అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతాం: భానుప్రకాష్ రెడ్డి
ఈరోజు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1500 పెరిగి.. రూ.93,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.93,000గా ఉండగా.. ముంబైలో రూ.93,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.97,500లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,600గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.97,500లుగా నమోదైంది.